గజ్వేల్, డిసెంబర్ 17: ప్రభుత్వం రైతులపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, సాగు భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమని సీఎం రేవంత్‌రెడ్డికి మొరపెట్టుకున్నా వదలడం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం గజ్వేల్‌లోని అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల రైతులకు మద్దతుగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న లగచర్ల రైతులపై లాఠీచార్జి చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమని రేవంత్‌రెడ్డి అతడి సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం కనికరించకుండా నిర్ధాక్షిణంగా వ్యవహరించారన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఏమాత్రం పట్టింపు లేకుండా తనకు నచ్చితే చాలు అనే దోరణితో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని విమర్శించారు. నెల రోజులకు పైగా రైతులు జైలులోనే ఉన్నారని, వారిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేసి కేసులు ఎత్తివేయాలన్నారు.
ఎలాంటి కారణం లేకుండా మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖడిస్తున్నామని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాడ్ చేశారు. లేనిపక్షంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీ రవీందర్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, పార్టీ మండల అధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కుమార్, మాజీ జడ్పీటీసీలు ఎల్లయ్య, మల్లేశం, కౌన్సిలర్లు శివకుమార్, అత్తెల్లి శ్రీనివాస్, బాలమణి, శ్రీనివాస్, కనకయ్య, రవీందర్, శ్రీధర్, నాయకులు కృష్ణారెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, దుర్గయ్య, దేవేందర్, రమేశ్‌గౌడ్, అహ్మద్, ఆర్కే శ్రీను, గొడుగు స్వామి, నర్సింగరావు, స్వామిచారి, శివకుమార్, హైదర్‌పటేల్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.