Bride | నిజాంపేట, నవంబర్ 8 : నిజాంపేటకు చెందిన బూరుగుపల్లి లింగవ్వ-పెంటయ్య దంపతుల కూతురు భాగ్యలక్ష్మి వివాహం స్థానిక ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ఈ వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన వంతుగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన స్థానిక నేతల ద్వారా ఆర్థిక సాయాన్ని వధువు భాగ్యలక్ష్మికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చల్మెటి నాగరాజు, యూత్ మండలాధ్యక్షుడు మావురం రాజు, మండల ఉపాధ్యక్షుడు లచ్చపేట రాములు, నాయకులు పంపరి నగేష్, తాడెం మహేష్, బూరుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
రూ.కోట్లతో కొలువులు.. నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ
ఇందిరమ్మ బిల్లుల్లో తిరకాసు.. నగదు చెల్లింపులో మాట మార్చిన సర్కారు
PDSU | పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ