జహీరాబాద్, సెప్టెంబర్ 21 : బంజారాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టింది. బంజారాలు (గిరిజనులు) ఎన్నో ఏండ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నా.. గత ప్రభుత్వలు వారికి హక్కులు కలిపించలేదు. బీఆర్ఎస్ ప్రభు త్వం పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను గుర్తించి హక్కుల కల్పించింది.
బంజారాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు జహీరాబాద్ పట్టణంలో రూ. 50 లక్షలతో సామూహిక భవనం నిర్మాణం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బంజారాల అభివృద్ధి, సంక్షేమం కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఇంగ్లిషు మీడియం బోధన చేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 54 గిరిజన తండాలు ఉన్నాయి. వారు సమావేశాలు నిర్వహించుకోనేందుకు విశాలమైన భవనం నిర్మాణం చేస్తున్నారు. సామూహిక భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం తో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గతంలో జహీరాబాద్ నియోజకవర్గంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ బంజారాలను ఓట్లు కోసం వాడుకున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదు. గిరిజన తండాలకు తాగునీటి సౌకర్యం కలిపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గంలో 54 గిరిజన తండాలు ఉన్నా యి. గిరిజనులు జహీరాబాద్ పట్టణంలో సమావేశాలు నిర్వహించుకోనేందుకు వారికి ఎలాంటి భవ నం లేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లు విలువైన స్థలాన్ని జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇచ్చింది. స్థలం ఇచ్చి రూ. 50 లక్షలు మంజూరు చేసింది. ప్రభు త్వం నిధులు మంజూరు చేసి భవన నిర్మాణ పనులు చేసేందుకు కాంట్రాక్టరుకు అప్పగించారు. విశాలమైన సమావేశ మందిరంతో పాటు గదులు నిర్మాణం చేస్తున్నారు. భవన నిర్మాణ పనులు జోరుగా సాగడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థలం ఇచ్చి భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు తెలిపారు.