నేడు ఆధ్యాత్మిక దినోత్సవం.. ఆధ్యాత్మిక కృషి.. శిఖరమంతెత్తు!
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకుంది.
- జిల్లాలో మందిరాల అభివృద్ధికి ప్రాధాన్యం
- ఆలయాలకు నెలవై.. ఆధ్యాత్మికత కొలువై… ధార్మిక చింతనకు పురిగొలిపే సిద్దిపేట!
- నిత్యం వేదమంత్ర ఘోషతో మార్మోగే పురవీధులు
- స్వరాష్ట్రంలో పురాతన ఆలయాలకు పూర్వవైభవం
- ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతర కృషి
- జిల్లాకేంద్రంలో కార్యక్రమానికి హాజరు కానున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట టౌన్, జూన్ 20: స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహించనున్నది.
అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం…
సీఎం కేసీఆర్ మతాలను గౌరవించి సమ ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. ఆలయాల అభివృద్ధితోపాటుగా మసీదులకు, చర్చిలకు నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ధూపదీప నైవేద్య అర్చకులు, అర్చక ఉద్యోగుల మాదిరిగానే మసీదులో సేవలు చేసే ఇమామ్‌లకు గౌరవ వేతనం దేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా ఇస్తున్నారు.
ఆలయాల ఖిల్లా సిద్దిపేట జిల్లా…
ఆధ్యాత్మికత, ఆలయాల ఖిల్లాగా సిద్దిపేట విరాజిల్లుతోంది. పురాతన ఆలయాలెన్నో జిల్లాలో అడుగడుగున కనిపిస్తాయి. నిత్యం ప్రత్యేక పూజలు, వేదామంత్రోచ్ఛాణలతో ఆధ్యాత్మిక, ధార్మిక పట్టణంగా పేరుగాంచింది. సకల ఆలయాలు కొలుదీరారు. కోవెల కోట సిద్దిపేట. ఇంతటి విశేషమైన పట్టణంలో కాకతీయుల కాలంలో నిర్మించిన వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన భోగేశ్వర ఆలయం ఉండం విశేషం. శరభేశ్వర ఆలయం, రామాలయం, కోటిలింగేశ్వర, రాగిచెట్టు హనుమాన్, గణపతి, సంతోషిమాత, అయ్యప్ప, పాత, కొత్త వేంకటేశ్వర స్వామి, సువర్చల సహిత హనుమాన్, షిరిడీ సాయిబాబా, రేణుకా (ఎల్లమ్మ) మాత, హనుమాన్ ఆలయాలు ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతాయి.
నేడు ఆధ్యాత్మిక దినోత్సవం…
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట మోహినీపురా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పాల్గొటారని ఆలయ కార్యనిర్వహణ అధికారి విశ్వనాథ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ద్రవిడ ప్రబంధ పారాయణం, సుదర్శన హోమం, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణాలు, హరికథలు తదితరత పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అనంతరం ధూపదీప నైవేద్య పథకానికి ఎంపికైన 171 మంది అర్చకులకు ప్రభుత్వం ఇచ్చిన మంజూరు పత్రాలను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందజేయనున్నారు.
ఆలయాల అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు కృషి…
మంత్రి హరీశ్‌రావు ఆలయాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పించారు. పట్టణంలోని భోగేశ్వర తదితర ఆలయాలకు జీర్ణోద్ధరణ గావించి మన ఘన చరిత్ర భవిష్యత్ తరాలకు అందేలా కృషి చేశారు. అనేక ఆలయాల సుందరీకరణకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని ఆలయాలు
- స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం
నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1805 ఆలయాలకు కేవలం ప్రతి నెలా రూ.2500 వందల చొఫ్పున చెల్లించేవారు. నేడు 6441 ఆలయాలకు దీపధూప నైవేద్య అర్చకులకు రూ.10 వేల చొఫ్పున ప్రతి నెలా గౌరవ వేతనం ఇస్తున్నారు.
మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్‌గా 30 శాతం చెల్లించేవారు. బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల పునరుద్ధరణకు కేవలం రూ.3 లక్షలు అందించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కామన్ గుడ్ ఫండ్‌లో భాగంగా ఆలయాల పునరుద్ధరణ, వేద పాఠశాల నిర్వహణ, నూతన ఆలయాలకు కల్యాణ మండపాల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులను మంజురు చేసి ఆలయాకు పూర్వ వైభవం తెచ్చారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూపొందించి ఆలయాల్లో అభివృద్ధి పనులను చేపట్టారు.
- ఆంధ్రానాయకుల పాలనలో అన్యాక్రాంతమైన ఎకరాల విలువైన ఆలయ భూములను స్వాధీనం చేసుకొని ఆ భూ ముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోందీ బీఆర్ఎస్ సర్కార్.
- దేశంలో అర్చకులకు, ఆలయ సిబ్బందికి గ్రాంట్ ఇన్ ఏయిడ్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే.
- భక్తులను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేసి ఆలయాలను అన్ని విధాలా అభివృద్ధి చేసున్నారు.
- బోనాలు, బతుకమ్మ పండుగలు, మేడారం జాతర అధికారికంగా నిర్వహిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవాప్తం చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

