సిద్దిపేట, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసిన విషయం తేలిసిందే. ఓట్ల రూపంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించింది. బీఆర్ఎస్ ఏకంగా 36 శాతం ఓట్లు తెచ్చుకొని సత్తా చూపింది. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం పోలైన ఓట్లు 4,12,548 కాగా, ఇందులో కాంగ్రెస్‌కు 1,59,099 ఓట్లు రాగా 38.56 శాతంగా నమోదయ్యాయి.
బీఆర్ఎస్కు 1,46,324 ఓట్లు రాగా 36శాతం నమోదైంది. బీజేపీకి 48,664 ఓట్లు రాగా 11.79 శాతం నమోదైంది. మిగతావి ఇతరులకు ఓట్లు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నమోదైన వివరాలను చూస్తే మొత్తం పోలైన ఓట్లు 82,921, ఇందులో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 33,456 రాగా 40.34 శాతం, కాంగ్రెస్‌కు ఓట్లు 31,822 రాగా 38.37 శాతం, బీజేపీకి 9,515 ఓట్లు రాగా 11.47శాతంగా నమోదైంది. మిగతావి ఇతరులకు ఓట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం పోలైన ఓట్లు 69,823, ఇందులో బీఆర్ఎస్కు 26,344 ఓట్లు రాగా 38 శాతం, కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 27,799, 39.81 శాతం, బీజేపీకి 11,961 ఓట్లు రాగా 17.13 శాతంగా నమోదైంది. మిగతావి ఇతరులకు ఓట్లు పడ్డాయి.
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం పోలైన పోలైన ఓట్లు 2,59,804 కాగా ఇందులో బీఆర్ఎస్కు 86,524, ఓట్ల శాతం 33.30, కాంగ్రెస్‌కు 99,478, ఓట్ల శాతం 38.28, బీజేపీకి 27,188, ఓట్లశాతం 10.46, ఎంఐఎంకు 8526, ఓట్ల శాతం 3.2 నమోదైంది. మిగతావి ఇతర పార్టీలకు పడ్డాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రచ్చబండల వద్ద, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ లెక్కలతో సహ ఎండగట్టారు. స్థానిక సంస్థలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేసి సక్సెస్ అయ్యారు. మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్కు 40.34 శాతం
సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం పోలైన ఓట్లు 82,921, ఇందులో బీఆర్ఎస్కు ఓట్లు 33,456, కాంగ్రె స్కు 31,822 ఓట్ల్లు, బీజేపీకి 9,515 ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట్లు ఇతర పార్టీలు, స్వతంత్రులకు పడ్డాయి. జిల్లాలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది.
1) గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో మున్సిపాలిటీలో పోలైన ఓట్లు 37,088, ఇందులో బీఆర్ఎస్కు 16,175 ఓట్లు, కాంగ్రెస్‌కు 13,949, బీజేపీకి 4,416, ఇతరులకు 887 ఓట్లు పోలయ్యాయి.
2) దుబ్బాక మున్సిపాలిటీలో 18,150 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్కు 6,256, కాంగ్రెస్‌కు 4,403, బీజేపీకి 3,487, ఇతరులకు 3,749 ఓట్లు పడ్డాయి.
3) చేర్యాల మున్సిపాలిటీలో పోలైన ఓట్లు 11,491 కాగా ఇందులో బీఆర్ఎస్కు 5,499, కాంగ్రెస్‌కు 5,275, బీజేపీకి 125, ఇతరులకు 592 ఓట్లు పడ్డాయి.
4) హుస్నాబాద్ మున్సిపాలిటీలో 16,192 ఓట్లు పోల్‌కాగా బీఆర్ఎస్కు 5,526, కాంగ్రెస్‌కు 8,198, బీజేపీకి 1,487, ఇతరులకు 984 ఓట్లు పడ్డాయి.
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు 33.30 శాతం
సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 11 మున్సిపాలిటీల్లో 2,59,804 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్కు 86,524, కాంగ్రెస్‌కు 99,478, బీజేపీకు 27,188, ఎంఐఎంకు 8,526, ఇతరులకు 38,088 ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీల వారీగా చూసుకుంటే…
1) ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 13,059 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు 7210, బీఆర్ఎస్కు 4764, బీజేపీకి 1085 ఓట్లు పడగా మిగిలినవి ఇతరులకు పడ్డాయి.
2) నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 12,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు 6,239, బీఆర్ఎస్కు 4,200, బీజేపీకి 1,696 ఓట్లు రాగా మిగిలినవి ఇతరులకు పోలయ్యాయి.
3) గడ్డపోతారం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 3423, బీఆర్ఎస్కు 4839, బీజేపీకి 748 ఓట్లు వచ్చాయి. మిగిలినవి ఇతర పార్టీలకు నమోదయ్యాయి.
4) గుమ్మడిదల మున్సిపాలిటీలో 19,514 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్కు 7,660, కాంగ్రెస్‌కు 2871, బీజేపీకి 813, మిగిలినవి ఇతరులకు పోలయ్యాయి.
5) జహీరాబాద్ మున్సిపాలిటీలో 56,884 ఓట్లు పోల్‌కాగా ఇందులో బీఆర్ఎస్కు 18,194, కాంగ్రెస్‌కు 21,558, బీజేపీకి 7,309, ఎంఐఎంకు 3,550 ఓట్లుపడ్డాయి. మిగిలినవి ఇతరులకు పోలయ్యాయి.
6) కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 8,163 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్కు 3,266, కాంగ్రెస్‌కు 3077, బీజేపీకి 434, ఎంఐఎంకు 378 ఓట్లు రాగా మిగతావి ఇతరులకు పోలయ్యాయి.
7) ఇంద్రేశం మున్సిపాలిటీలో 13,086 ఓట్లు పోల్‌కాగా ఇందులో బీఆర్ఎస్కు 4170, కాంగ్రెస్‌కు 4010, బీజేపీకి 1577 ఓట్లు వచ్చాయి. మిగిలినవి ఇతరులకు పడ్డాయి.
8) ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 27,472 ఓట్లు పోల్‌కాగా బీఆర్ఎస్కు 10,876, కాంగ్రెస్‌కు 11,040 , బీజేపీకి 1571 ఓట్లు పడ్డాయి. మిగతా ఓట్లు ఇతరులకు పోలయ్యాయి.
9) సదాశివపేట మున్సిపాలిటీలో 29,151 ఓట్లు పోల్ కాగా ఇందులో బీఆర్ఎస్కు 10,599, కాంగ్రెస్‌కు 12,265, బీజేపీకి 2500, ఎంఐఎంకు 1092 ఓట్లు పోలయ్యాయి.
10) జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 3623 ఓట్లు, కాంగ్రెస్‌కు 3641, బీజేపీకి 2245 ఓట్లు పోల్ కాగా ఇతరులకు మిగతా ఓట్లు పడ్డాయి.
11) సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 17620, కాంగ్రెస్‌కు 24092, బీజేపీకి 7026, ఎంఐఎం 3361, ఇతరులు 9546 ఓట్లు సాధించారు.
మెదక్ జిల్లా లో బీఆర్ఎస్కు 38 శాతం
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం పోలైన ఓట్లు 69,823, ఇందులో బీఆర్ఎస్కు 26,344, కాంగ్రెస్‌కు 27,799, బీజేపీకి 11,961 ఓట్లు వచ్చాయి. మిగతావి ఇతరులకు పోలయ్యాయి.
1) మెదక్ మున్సిపాలిటీలో మొత్తం పోలైన ఓట్లు 28,976 కాగా ఇందులో బీఆర్ఎస్కు 10,987, కాంగ్రెస్‌కు 12,178, బీజేపీకి 3,169 ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట్లు ఇతరులకు పోలయ్యాయి.
2) నర్సాపూర్ మున్సిపాలిటీలో 13,210 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్కు 4,107, కాంగ్రెస్‌కు 5538, బీజేపీకి 3199 ఓట్లు రాగా ఇతరులకు మిగతా ఓట్లు పడ్డాయి.
3) రామాయంపేట మున్సిపాలిటీలో మొత్తం 11,110 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్కు 3586, కాంగ్రెస్‌కు 4267, బీజేపీకి 2486, మిగతావి ఇతరులకు పడ్డాయి.
4) తూప్రాన్ మున్సిపాలిటీలో పోలైన ఓట్లు 16,470 కాగా ఇందులో బీఆర్ఎస్కు 7248, కాంగ్రెస్‌కు 5892, బీజేపీకి 2106 ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట్లు ఇతరులకు పడ్డాయి.