కంది, జనవరి 22: పేదలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేలాల అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి కిష్టయ్యగూడెం గ్రామానికి చెందిన శంకరమ్మ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో ఎల్వోసీ అందజేసి చికిత్స జరిపించారు. బాధితురాలు కాలు కోల్పోవడంతో శనివారం రాత్రి చింతా ప్రభాకర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పని చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్వోసీ, సీఎంఆర్ చెక్కులతో బాధితులను ఆదుకుంటున్నారని గుర్తుచేశారు. ఎల్వోసీ తమకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడిందని, ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతావిజయేందర్‌రెడ్డి, కౌన్సిలర్ లావణ్య ప్రభుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.