నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగింది. నర్సాపూర్ మండల, మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని వీధి వీధి తిరుగుతూ దుకాణాలను బంద్ చేయించారు. అంతకుముందు నర్సాపూర్ సబ్స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ చేపడుతూ బీసీలకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బంద్ నేడు విజయవంతమైందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుండో ప్రచారంలో ఉందని, కొందరు నాయకులు దీనిని కావాలనే నానబెట్టారని వెల్లడించారు. బీసీలను విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతామని ఘాటుగా విమర్శించారు. తక్షణమే బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, సత్యం గౌడ్, వి.శ్రీనివాస్ గౌడ్, రాకేష్ గౌడ్, బాలరాజ్ శివకుమార్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.