Papannapeta | పాపన్నపేట, మే 30 : పాపన్నపేట మండల పరిధిలోని యూసఫ్పేట్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు పెద్దన్న గారి శశిధర్ రెడ్డి అంత్యక్రియల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం రాత్రి ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం యూసఫ్పేట గ్రామం చేరుకొని శశిధర్ అంతక్రియల్లో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితోపాటు పాపన్నపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, యూసఫ్పేట్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పరి శేఖర్, తాజా మాజీ ఎంపీటీసీ జ్యోతి సాయిలు, ఆరెపల్లి మాజీ సర్పంచ్ శ్రీనాథ్ రావు, యూసఫ్పేట గ్రామ బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రావు, గోపాల్, అశోక్, ఉమా మహేశ్వర్, వెంకొబా తదితరులు ఉన్నారు.