Padma Devender Reddy | మెదక్ రూరల్ : మెదక్ మండలం పేరూరు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట నిర్వహించారు. ఈ మహోత్సవంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పి ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మెదక్, మాచవరం పిఎసిఎస్ చైర్మన్లు హనుమంత్ రెడ్డి, సీతారామయ్య నాయకులు జయరాం రెడ్డి, కిష్టయ్య, ప్రభాకర్, రామచంద్ర రెడ్డి, ఏగొండ రాములు, మల్లేశం, శ్రీధర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.