త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లనే ఖరారు చేయడంతో పెద్దఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పెద్దఎత్తున బైక్‌ర్యాలీలు నిర్వహించారు. దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అంటూ నినదించారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించారని కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పెద్దఎత్తున కృషి చేశారు. భారీగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాల రూపురేఖలనే మార్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, రహదారుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునిటీని అందించారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేయడంతో సిట్టింగులందరికీ సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, ఆగస్టు 21
(గజ్వేల్) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
పేరు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
నియోజకవర్గం : గజ్వేల్
జననం : 1954, ఫిబ్రవరి 17
చింతమడక, సిద్దిపేట జిల్లా
రాజకీయ పార్టీ : భారత రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు : రాఘవరావు, వెంకటమ్మ
జీవిత భాగస్వామి : శోభ
సంతానం : కల్వకుంట్ల తారకరామరావు, కల్వకుంట్ల కవిత
విద్యార్హత : ఎం.ఏ సాహిత్యం (ఉస్మానియా విశ్వవిద్యాలయం)
(సిద్దిపేట) తన్నీరు హరీశ్‌రావు
పేరు : తన్నీరు హరీశ్‌రావు
నియోజకవర్గం : సిద్దిపేట
జననం : 1972, జూన్ 3
చింతమడక, సిద్దిపేట జిల్లా
రాజకీయ పార్టీ : భారత రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు : సత్యనారాయణరావు, లక్ష్మీబాయి
జీవిత భాగస్వామి : శ్రీనిత
సంతానం : కుమారుడు, కుమార్తె
విద్యార్హత : పీజీ, కాకతీయ యూనివర్సిటీ
రాజకీయ ప్రస్థానం : ఆరు సార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యువజన క్రీడలశాఖ మంత్రిగా…
విజయాలు :
(దుబ్బాక) కొత్త ప్రభాకర్ రెడ్డి
పేరు : కొత్త ప్రభాకర్‌రెడ్డి
నియోజకవర్గం : దుబ్బాక
జననం : 1966, జూన్ 6
పోతారం, దుబ్బాక, సిద్దిపేట జిల్లా
రాజకీయ పార్టీ : భారత రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు : కిష్టారెడ్డి, లలితమ్మ
జీవిత భాగస్వామి : మంజులత
సంతానం : పృథ్వీరెడ్డి, కీర్తిరెడ్డి
విద్యార్హత : డిగ్రీ (సిద్దిపేట డిగ్రీకళాశాల)
రాజకీయ ప్రవేశం : 2009 టీఆర్ఎస్ (బీఆర్ఎస్)
పదవులు :
(హుస్నాబాద్) వొడితెల సతీశ్‌కుమార్
పేరు : వొడితెల సతీశ్‌కుమార్
నియోజకవర్గం : హుస్నాబాద్
జననం : 1965, సెప్టెంబర్ 30
రాజకీయ పార్టీ : భారత రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు : కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు
విద్యార్హత : ఎంటెక్ (డిజైన్ ఇంజినీర్)
రాజకీయ ప్రస్థానం :