గజ్వేల్, మే 31: చిన్నారులు ఆడుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్‌లోని హౌసింగ్‌బోర్డు మైదానంలో ఏర్పాటు చేసిన పార్కు నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది. పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ఎక్కడికక్కడ విరిగిపోవడంతో చిన్నారులు ఆటలకు దూరం అవుతున్నారు. విరిగిన జారుడు బండలు, ఊయ్యాలలు, పార్కు చెత్తతో దర్శనమిస్తున్నది. జిమ్‌పై ఏర్పాటు చేసిన మ్యాట్లు దెబ్బతిన్నాయి. అందులోని కొన్ని పరికరాలు వాడకంలో లేకుండాపోయాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చిన్నపిల్లల పార్కు సంరక్షణ బాధ్యతను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రాతినిథ్యం వహిస్తున్న 18వ వార్డులోనే ఈ పార్కు ఉండడం విశేషం.
గజ్వేల్ హౌసింగ్ బోర్డు మైదానంలోని చిన్న పిల్లల పార్కులో త్వరలోనే మరమ్మతులు చేపడుతాం. ఇప్పటికే టీఎఫ్ఐడీసీ వారికి రూ.2 కోట్లతో పార్కును అధునీకరించేందుకు నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాం. అందరి సౌకర్యార్థం త్వరలోనే అన్ని హంగులతో పార్కును అందుబాటులోకి తీసుకొస్తాం.