మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో మంగళవారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు.
ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడగా.. బాలిక కేకలు వేయగా ఈ విషయాన్ని తల్లి గమనించి చిన్నశంకరంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.