ధరూరు, సెప్టెంబర్ 23: రైతులు చేస్తు న్న ఆందోళనలతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు సాగునీటిని విడుదల చేసింది. దీంతో బీఆర్ఎస్ నాయకురాలు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి బుధవారం పీజేపీ కుడి కాలువ వద్దకు చేరుకొని సంబురాలు జరుపుకొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రైతుల ఆందోళనలకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు నిరంతరం అండగా నిలిచి పోరాటం చేశారని పలువురు పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం దిగొచ్చి జూరాల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసిందని తెలిపారు.