చిలిపిచెడ్, సెప్టెంబర్ 26 : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమరి గ్రామంలో దుర్గామాతకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. శుక్రవారం హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాతకు గ్రామస్తులు అందరూ కలిసి ఇంటింటే బోనం సమర్పించారు.
అనంతరం బోనాలు ప్రధాన వీధుల గుండా ఆటపాటలతో తిరుగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అమ్మవారి దయతో పాడిపంటలు మంచిగా పండాలని, గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, స్వాములు పాల్గొన్నారు.