అమీన్పూర్, జూలై 4: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ప్రమాదం తర్వాత తమ వారి మృతదేహాల కోసం కుటుంబీకులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పటాన్చెరు ఏరియా దవాఖాన వద్ద మృతుల రక్త సంబంధీకులు మృతదేహాల కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం, పరిశ్రమ నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూపేనా ఒక్కొక్కరికి సుమారుగా కోటి పది లక్షల రూపాయల వరకు రానున్నాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు సైతం వచ్చి మృతదేహాలను తరలించడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.