మెదక్ అర్బన్, అక్టోబర్18: ప్రజా సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలోలేని పథకాలను తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ కాంగ్రె స్, బీజేపీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వడ్ల రాంచందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మీకాంత్‌రెడ్డి, మోహన్, 30 మంది పార్టీలో చేరారు. జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మెదక్ 5వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.