మెదక్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తనను నమ్మి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీలోని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయకేతనం చూపుతూ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. మెదక్ సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించి మెదక్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.