జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరిన నాయకులు
సంగారెడ్డి, డిసెంబర్ 14: జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు. బుధవారం ఢిల్లీలోని అఖిలేశ్ యాదవ్ నివాసంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల్లో చలనం వస్తోందని, ఆయన వెన్నంటే ఉండి మద్దతు పెంచాలని సూచించారు. ప్రజావ్యతిరేక పాలనతో దేశ ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చిందని, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేసి ప్రజావ్యతిరేక పాలనన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేది బీఆర్ఎస్ పార్టీ అని అఖిలేశ్ యాదవ్ అభివర్ణించారని బీరయ్య యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో అల్లాపురం నారాయణ, మేఘాలయా రాష్ట్ర ప్రతినిధులున్నారు.