భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఉమ్మడి జిల్లాపై ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ ఆది నుంచి కంచుకోట. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో జిల్లా అన్నింటా ఆదర్శంగా ఉన్నది. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. ఇదే సభలో మంత్రి హరీశ్‌రావు పదికి పది స్థానాలు గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటుండగా.. క్యాడర్లో జోష్ కనిపిస్తున్నది. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే..మాఓటు సీఎం కేసీఆర్‌కే వేస్తాం… మంత్రి హరీశ్‌రావుకే మా మద్దతు అంటూ గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులే లేని విచిత్ర పరిస్థితులను కాంగ్రెస్, బీజేపీ ఎదుర్కొంటుండడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికలపై దృష్టి సారించి, అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకునే పనిలో
నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధే ప్రధాన అస్ర్తాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు ఆది నుంచి కంచుకోట. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో జిల్లా అన్నింటా ఆదర్శంగా ఉన్నది. త్వ రలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పక్కా ప్రణాళికల రచిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెదక్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది. ఇదే సభలో మంత్రి హరీశ్‌రావు పదికి పది స్థానాలు గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామని పిలుపునిచ్చారు. పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించడంతో వారంతా జనం మధ్యనే ఉంటున్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఈ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుడుతున్నది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం అందని ఇల్లు అంటూ లేదు. ఇదే విషయా న్ని బీఆర్ఎస్ క్యాడర్ ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఈ తొమ్మిదేండ్లు మీ మధ్యనే ఉన్నాం. ఇప్పుడు కూడా మీ మధ్యనే ఉం టున్నాం. మీరంతా నిండు మనస్సుతో దీవించి మంచి మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల వచ్చాయంటే ఎవరెవరో వస్తారు.. వారి మాటలు నమ్మవద్దు ఎన్నికలు అయిపోగానే వారు మళ్లీ కనిపించరు. మీకండ్ల ముందు జరిగిన అభివృద్ధి, సం క్షేమ పథకాలను చూసి సీఎం కేసీఆర్‌ను దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మా మాద్దతు బీఆర్ఎస్ పార్టీకే.. మా ఓటు సీఎం కేసీఆర్‌కే వేస్తాం.. మంత్రి హరీశ్‌రావుకే మా మద్దతు అంటూ గ్రామాలు, పట్టణాల్లో అన్నివర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ‘70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏండ్లలోనే జరిగింది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మా కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకం అం దని ఇల్లు అంటూ లేదు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతబీమా, రుణమాఫీ తదితర పథకాలతోపాటు ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు.. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి’.. అంటూ గ్రామాల ప్రజలంతా కలిసికట్టుగా తమ మద్దతు బీఆర్ఎస్కే అంటూ తీర్మానాలు చేసి అందిస్తున్నారు. ఎన్నికల ఖర్చులకు డబ్బులు సైతం అందజేస్తూ మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. వివిధ గ్రామాల్లోని కుల సంఘాలు సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. గజ్వేల్ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా ఒక్కటై లక్ష ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మద్దతుగా సిద్దిపేట రూరల్ మండలం రాంపూరు గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడే తొలి ఏకగ్రీవ తీర్మానం జరిగింది. మళ్లీ రాంపూరు గ్రామస్తులు తీర్మానం చేయడంతోపాటు ఎన్నికల ఖర్చుకు రూ. 5116 నగదు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. తొలిసారిగా రాంపూరు నుంచి ప్రారంభమైంది. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గౌడ కులస్తులు, సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెళ్లి గ్రామ మత్స్యకార సహకార సం ఘం, ముదిరాజ్‌లు, ఇర్కోడు గ్రామ పంచాయితీ మధిర గ్రామమైన హనుమంతునిపల్లి ముదిరాజ్ సంఘం, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌నగర్ ముదిరాజ్ సంఘం, తోర్నాలలోని రజక సం ఘం, మున్నూరుకాపు సంఘం, రావురూకుల కుర్మ సంఘం సభ్యులు మంత్రి హరీశ్‌రావుకు జైకొట్టారు. గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు కుల సంఘాలకు నిధులు ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ వైపు నిలుస్తామని నినదించారు. దుబ్బాక నియోజకవర్గంలో సైతం ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు మద్దతుగా గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.
అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో క్యాడర్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. జిల్లాలో అన్నిచోట్ల సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంతో మరోసారి వారి గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభా స్థానాలు ఉన్నాయి. దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. నర్సాపూర్ మినహా అన్నింటా అభ్యర్థులను ప్రకటించారు. ఈ స్థానానికి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, 2018 ఎన్నికల్లో 10 స్థానాలకు 9 స్థానాల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్నింటా విజయబావుటా ఎగురవేసింది. అన్ని మండల పరిషత్‌లతోపాటు జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. మెజార్టీ గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. బలమైన క్యాడర్‌తోపాటు సుస్థిర ప్రభు త్వం, పెద్దఎత్తున జరిగిన అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ విజయానికి సోపానంగా నిలవనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసేలా గులాబీ సైనికులు ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను కలుస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నా రు. నిత్యం వివిధ కార్యక్రమాలు చేపడతూ ప్రజలకు, క్యాడర్ మధ్యన ఉంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్‌రావు నేతృత్వంలో సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి వివిధ స్థాయిల ఉన్న నేతలంతా బీఆర్ఎస్లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నట్లు వారు ప్రకటించారు. గ్రూపులు, కుమ్ములాటలు, ముష్టి యుద్ధ్దాలు, వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ నాయకుల తీరుకు నిరసనగా ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి టికెట్ రాదో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదారు గ్రూపులు ఉన్నాయి. ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టింది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ నుంచి నిత్యం బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. దుబ్బా క బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు బీజేపీ క్యాడర్ పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరింది. మెదక్‌లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో భారీగా చేరికలు జరిగాయి. ఆందోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ నేతృత్వంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలంతా మం త్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యం లో బీఆర్ఎస్లోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ చేజారి పోతుండడంతో ఆ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.