Govt Colleges | రామాయంపేట, జూన్ 08 : పదవ తరగతి పాసైన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని అందుకోసం ప్రతీ విద్యార్ధి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే అడ్మిషన్ తీసుకోవాలని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మల్లేశం అన్నారు.
ఆదివారం రామాయంపేట మండలంలోని కోనాపూర్, అక్కన్నపేట, డి ధర్మారం తదితర గ్రామాలలో విద్యార్థుల ఇళ్ల వద్దకు తిరుగుతూ విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థుల తల్లితండ్రులు కచ్చితంగా ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనైతే నాణ్యమైన విద్యతోపాటు ఫీజులు లేకుండా విద్య, మంచి అధ్యాపకులతో చదువు చెప్పబడుతుందన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాబురావు, అశోక్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి