Bethalaswamy Jathara | అల్లాదుర్గం, ఏప్రిల్ 13 : ఏడుపాయల వనదుర్గామాత జాతర తర్వాత అంతటి ప్రాచుర్యాన్ని పొందిన జాతర బేతాళ స్వామి జాతర. అల్లాదుర్గంలో కొలువుదీరిన బేతాళ స్వామి దేవాలయం రాష్ట్రంలోనే రెండవ ఆలయంగా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయాన్ని 4 వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ప్రాచుర్యంలో ఉంది.
వందల ఏండ్ల క్రితం తీవ్రమైన వ్యాధులు ప్రబలి ప్రజలు మృతిచెందడంతో ప్రజలకు వ్యాధులు నయమై ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని భూత, ప్రేత, పిశాచ గణాలకు అధిపతిగా పిలువబడే బేతాళుడి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా వాడుకలో ఉంది. గ్రామానికి బేతాళుడు రక్షగా ఉన్నాడని ప్రతియేటా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వారం రోజులపాటు జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. స్వామిని నమ్ముకున్న భక్తులకు వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. అలా కోరికలు తీరిన వారు స్వామివారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లిస్తారు.
వారం రోజులపాటు జాతర..
ఈ జాతర ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. 14వ తేదీన పోలేరమ్మ దేవతకు బోనాలు, 15వ తేదీన పోచమ్మ దేవతకు బోనాలు, 18వ తేదీన దుర్గమ్మ దేవతకు బోనాలు, 17వ తేదీన బేతాళ స్వామికి బోనాలు, 18న బేతాళ స్వామికి ఎడ్ల బండ్ల ఊరేగింపు, 19న భాగవతం, 20న భజనలు, 21న సాంస్కృతిక కార్యక్రమాలు, 22న పాచి బండ్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యం కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్