మెదక్ : మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమం ద్వారా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం కల్పిస్తుంది. ప్రవేట్ పాఠశాలలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వారు విద్యార్థులను తీసుకోవడం లేదు.
దీంతో తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. తక్షణమే బకాలు చెల్లించి పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.