మెదక్, ఆగస్టు 12 (నమసే ్తతెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ:అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్షిప్లు, ఇం డ్లు, ఇండ్ల స్థలాలు, దవాఖానల్లో ఈఎస్ఐ సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉం చాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి బస్వరాజు, బీడీ సిగార్స్ వర్కర్స్ యూని యన్ జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్పప్పటికీ కనీసం బీడీ కార్మికుల గురించి పట్టించుకోడం లేదని మండిపడ్డారు. బీడీలు చేయని వారికి రిటైర్మెంట్ పింఛన్, ఆసరా పింఛన్లు వస్తున్నాయని, వారిని గుర్తించి సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో అధికారులతో సర్వే చేయించి బీడీలు చేయని అనర్హులను తొలిగించి, అర్హులైన బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.