Mamindla Anjaneyulu | మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 20 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మెదక్ పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మామిండ్ల ఆంజనేయులుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తిగా రాజకీయ కక్ష్యపూరిత చర్యలో భాగంగానే మామిండ్ల ఆంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ మేరకు వారి వాదనలు విన్న హైకోర్టు మామిండ్ల ఆంజనేయులుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Read Also :
BRS | బీఆర్ఎస్లో చేరిన మాజీ జడ్పీటీసీ గుళ్లే రాజేశ్వర్
Harish Rao | అక్రమ కేసులతో కేటీఆర్.. బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు: హరీశ్ రావు
KTR | అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కేటీఆర్ భరోసా
NRI | సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌పై తప్పుడు కేసులు : గుర్రాల నాగరాజు