శివ్వంపేట, జూన్ 6: మండల కేంద్రంలోని బగలాముఖీశక్తిపీఠంలో గురువారం అమ్మవారికి విశేషమైన పంచగ్రహ కూటమి, హరిద్రార్చన, అభిషేకం, బగలా అష్టోత్తర నామార్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం, మంగళనీరాజనంతో పాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమావాస్య పర్వదినం సందర్భంగా ధ్యానమందిరంలో బగలాముఖీ మహామంత్ర హవనం నిర్వహించారు. శని జయంతి, అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గజ్వేల్ మున్సిఫ్ కోర్టు జడ్జి ప్రియాంక దంపతులు, శక్తిపీఠం స్థల దాతలు పబ్బ రమేశ్‌గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పూజల్లో శక్తిపీఠం ట్రస్ట్ సభ్యుడు శాస్ర్తుల పురుషోత్తం శర్మ, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, దాతలు నందకిశోర్, పెద్దగౌని సూర్యంకుమార్ గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, వంజరి కొండల్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగల్ల లక్ష్మీనర్సయ్య, నవాబ్‌పేట మాజీ సర్పంచ్ ఏనుగు అశోక్‌రెడ్డి, పైనం యాదగిరి, బొడ్డు భిక్షపతి, బాసంపల్లి పోచగౌడ్, ముద్దగల రాజు, షేక్ అలీ, సండ్ర సుదర్శన్, భక్తులు పాల్గొన్నారు.