రామాయంపేట రూరల్, మే 16 : రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సేవలను వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ బడుల్లో అందించే సేవలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాం తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదివితే అన్ని రకాల మేలు జరుగుతుందని గ్రామంలో విద్యార్థుల తలిదండ్రులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లే వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, ఉపాధ్యాయులు రాంచంద్రారెడ్డి, సాయి చందర్‌తో పాటు పంచాయితీ కార్యదర్శి సరితాదేవి, మాజీ ఉప సర్పంచ్ గంగాధర్, శ్రీనివాస్, సున్నం రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.