అవకాడోలో అధిక పోషకాలు
అవకాడో పండు ఎంతో విశిష్టమైనదని, అధిక దిగుబడులకు ఉత్తమమైన మేలు రకం పంట అని కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఫలపరిశోధన కేంద్రంలో అవకాడో సాగుపై
- ఏ,సీ,ఈ విటమిన్లు, పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువ
- గుండెపోటును నివారిస్తుంది
- రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తాం
- కొండా లక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్
- సంగారెడ్డి ఫలపరిశోధన కేంద్రంలో సదస్సు
- హాజరైన రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు
సంగారెడ్డి, జనవరి 31: అవకాడో పండు ఎంతో విశిష్టమైనదని, అధిక దిగుబడులకు ఉత్తమమైన మేలు రకం పంట అని కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఫలపరిశోధన కేంద్రంలో అవకాడో సాగుపై అనుభవం కలిగిన రైతు లు, వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల అన్నదాతలు తరలివచ్చి అవకాడోపై శాస్త్రవేత్తలు, రైతుల అనుభావాలను తిలకించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు మేలు రకాలకు చెందిన పండ్లను పండించి అధిక లాభా లు సాధించాలన్నారు.

నేటి సమాజంలో ఏ పండు తింటే ఏమవుతుందోనని, ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎలాం టి నష్టం కలిగించకుండా అధిక పోషకాలు అందించే అవకాడోను తీసుకోవాలన్నారు. ఇందులో ఎక్కువగా ఏ,సీ,ఈ విటమిన్లతో పాటు పోషక, పీచు పదార్థా లు అధికంగా ఉంటాయన్నారు. జా మ అకారంతో పెద్దాగా ఉండే అవకాడో మా నవ శారీరానికి అన్ని రకాలుగా మే లు చేస్తుందన్నారు. పూత దశలో పంటలకు కొన్ని చీడ, పీడల నుంచి రక్షించుకునేందుకు వ్యవసాయ అధికారులు సూచన లు, సలహాలు పాటించి సస్యరక్షణ చర్య లు తీసుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తుందన్నారు. వంద సంవత్సరాల ముందు నుంచి అవకాడో పంట పరిచ యం ఉందని, ఇందులో మోనోఅనే సేచురేటర్ కొవ్వులు అధికంగా ఉంటాయన్నారు. 5 ఏండ్లలో పంట ఎదుగుతుందని, అవకాడో గుండెపోటును తగ్గిస్తుందన్నారు. అరటిలో కన్నా అధిక పొ టాషియం ఉంటుందన్నారు. ఈ పం టను సాగు చేసేందుకు అన్నదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవకాడో అభివృద్ధికి ఫలపరిశోధన కేం ద్రం కృషి చేసి రైతులకు సలహాలు, సూ చనలు ఇవ్వాలని కోరారు. సదస్సులో కరుణాకర్, రాజ్‌కుమార్, టీవీఎస్ఎన్ వీర అరసు, శ్రీనివాస్‌రావు, బాబు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునీత, నిఖిల్ అరోరా, పవన్‌కుమార్, ప్రసాద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థినీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

