మెదక్ అర్బన్/ దుబ్బాక టౌన్, డిసెంబర్ 23: ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, దుబ్బాకలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రలో మెదక్ డివిజన్ మినీడోర్, బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆరెళ్ల జనార్దన్‌గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ వెల్కమ్ బోర్డ్ నుంచి ఆటోనగర్, పాతబస్టాండ్, రాందాస్‌చౌరస్తా, న్యూబస్టాండ్ మీదుగా వేలాది ఆటోలతో కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతున్నదన్నారు. తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఆటో కార్మికుల జీవనోపాధికి నష్టం కలుగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాకలో బస్‌స్టాండ్ ఎదుట ఆటో డ్రైవర్లు బైఠాయించి ఆందోళన చేప్టారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు మండల నర్సింలు, ఉపాధ్యక్షుడు చందు, గంభీర్పూర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ.షాదుల్, లచ్చపేట వార్డు అధ్యక్షుడు బిల్ల రవికుమార్, ప్రవీణ్, దుంపలపల్లి వార్డు ఆటో యూనియన్ అధ్యక్షుడు కోనేటి సత్తయ్య, చేర్వాపూర్ వార్డు బాధ్యులు రాజెల్లు, సుమన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టాటాఏస్ అధ్యక్షుడు నజీర్, నందు, ప్రవీణ్, భూంపల్లి మండల బాధ్యు లు స్వామి, శ్రీనివాస్‌గౌడ్, సతీశ్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, చెల్లాపూర్ వార్డు ఆటో యూనియన్ బాధ్యులు యాదవరెడ్డి, విష్ణు, మధుగౌడ్, కిష్టయ్య, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.