మిరుదొడ్డి, జూన్ 18: గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అతికం అంజాగౌడ్ (53) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి ఆటోను బయటకు తీస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి వస్తుందని తెలుపడంతో కుటుంబీకులు అతడిని చికిత్స కోసం సిద్దిపేటకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.