HomeMedakAt Apgv Bank The Customers Visited The Bank
పింఛన్లు, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఇవ్వాలి
మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్‌ను కలిసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకు వద్ద
ఆందోళన చేపట్టిన రైతులు, వృద్ధులు
చిలిపిచెడ్, డిసెంబర్ 14 : మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్‌ను కలిసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం బ్యాంకు వద్ద రైతులు, వృద్ధులు ఆందో ళన చేపట్టారు. మా ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టి, అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ మేనేజరు ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. రుణాలు తీసుకుంటే నోటీసు ఇవ్వకుండా ఆసరా పింఛన్లు, పీఎం కిసాన్ యోజన నగదు ఇవ్వడం లేదన్నారు.
బ్యాంకు మేనేజరు వివరణ…
లోన్లు తీసుకుని రెన్యువల్ చేయని రైతుల ఖా తాలను బ్లాక్ లిస్టులో పెట్టామని, ఆసరా పింఛన్లు నిలిపి వేయలేదని బ్యాంకు మేనేజరు చంపాలాల్ పేర్కొన్నారు. లోన్లు తీసుకున్న రైతులు తప్పనిసరి గా రెన్యువల్ చేయాలన్నారు. 2019 నుంచి లోన్లు రెన్యువల్ చేయని రైతుకు నోటీసు ఇచ్చి.. వారి ఖాతాలో ఉన్న నగదును తీసుకుంటు న్నామన్నారు. ఆధార్ కార్డు, పట్టాపాసుబుక్, 1బీ తీసుకుని వచ్చి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పండరి, సయ్యద్ హుస్సేన్, షఫీ, మాణ్యికం, విఠల్, వీరాస్వామి, పాపయ్య పాల్గొన్నారు.