స్థిర వేతనం నిర్ణయించాలని..
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తలకు కనీ స వేతనం రూ.18 వేల నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
- మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ఎదుట ఆశ కార్యకర్తల బైఠాయింపు
- బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
- తోసుకొని వెళ్లిన ఆశలు
మక్తల్, మార్చి 20 : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తలకు కనీ స వేతనం రూ.18 వేల నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. మక్తల్ ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి నారాయణపేట జిల్లా ఆశ కార్యకర్తల అధ్యక్షుడు బాలమణి అధ్యక్షతన సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటరామిరెడ్డి, గోవిందరాజుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ సీఐ రాంలాల్ తన సిబ్బందితో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆశ కార్యకర్తలను అడ్డుకున్నారు.
తమ డిమాండ్లను పరిషరించాలని మంత్రి ఇంటి ముట్టడిని శాంతియుత వాతావరణంలో చేపడితే, పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆశ కార్యకర్తలు ప్రశ్నిస్తూ, బారికేడ్ల్లు తోసుకుంటూ మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో సూచించిన విధంగానే, ఆశ కార్యకర్తల సమస్యలను పరిషరించి ప్రతి ఆశ కార్యకర్తలకు రూ.18వేతనం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆశ కార్యకర్తకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5వేల దహన ఖర్చులు, రిటర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు తదితర హామీలు నేటి వరకు రేవంత్‌రెడ్డి నెరవేర్చలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500లతోపాటు పారితోషకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి ఆశ కార్యకర్తలను ఆదుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పీఏకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నారాయణపేట జిల్లా నాయకులు నరహరి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ఆశ కార్యకర్తల యూనియన్ నాయకురాళ్లు గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, పార్వతమ్మ, వెంకటలక్ష్మి, ఫర్జానా బేగం, లతోపాటు ఆశ కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

