చిలిపిచెడ్, జనవరి 22 : మండలంలో మొత్తం 19 గ్రామపంచాయతీలు ఉన్నాయి.మండలంలోని ప్రజలు సుమారుగా 75 శాతం వ్యవసాయంపై జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాలు సమవృద్ధిగా పడడంతో చెరువు, కుంటల్లోకి నీళ్లు చేరడడంతో భూ గర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో పంటలు పండుతాయనే నమ్మకంతో రైతులు యాసంగి సాగుకు సిద్ధమయ్యా రు.
రైతులు ఎక్కువగా పత్తి, కంది, వరి పంటలను సాగు చేశారు. మండలంలోని మంజీరా పరివాహక గ్రామాలు అజ్జమర్రి,గంగారం, బండపోతుగల్,ఫైజాబాద్, చిలిపిచెడ్, చండూర్, చిట్కుల్లో రైతులు వరి పంటను ఎక్కువగా పం డిస్తున్నారు. ఈ యేడాది సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మూడు రోజుల క్రితం 0.35 టీఎంసీల నీటిని ఘనపూర్ ఆనకట్టకు వదిలారు. ఫలితంగా మంజీరానది పొడువునా ఉన్న చెక్‌డ్యాంలు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మంజీరా నదితోపాటు బోరుబావులపై నమ్మ కం పెట్టుకున్న రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు.
పంటకు పూర్తి స్థాయిలో నీరందే పరిస్థితి ఉండడంతో వరి నాట్లు వేస్తున్నారు. చాలా గ్రామాల్లో వరినాట్లు పూర్తి కావస్తు న్నాయి. బండపోతుగల్, అజ్జమర్రి, ఫైజాబాద్, చండూర్ గ్రామాల్లో వరి నాట్ల ముమ్మరంగా మొదలయ్యాయి. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం మండలంలోని 19 గ్రామాల్లో 8 వేల ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. వరితోపాటు 2వేల ఎకరాల్లో చెరుకు, కూరగాయలతోపాటు ఇతర అరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
వలస వచ్చిన 2 వేల మంది కూలీలు
యాసంగి వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. పొలం పనులకు కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో చిలిపిచెడ్ మండలంలోని రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. తెలంగాణతోపాటు యూపీ, బీహర్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన సుమారు 2 వేల మంది వలస వచ్చారు. కొన్నిచోట్ల మగ కూలీలు వరినాట్లు వేస్తున్నారు. వీరు ఎకరాకు రూ.4వేలు తీసుకుంటూ.. ఒకరోజు 5 నుంచి 6 ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారని రైతులు తెలిపారు.
అందుబాటులో ఎరువులు
రైతులు కావాల్సిన విత్తనాలతో పాటు ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. సోమక్కపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంతోపాటు చిలిపిచెడ్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు సరిపడేలా ఎరువులు అం దుబాటులో ఉన్నాయి. మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– బాల్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి