మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజ లు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి సమస్యల పరిష్కారానికి దూరప్రాంతాల నుంచి వస్తుంటారని, వారి సమస్యలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్ర జావాణిలో స్వీకరించిన దరఖాస్తులను అధికారులకు అందజేశారు. భూ సమస్యలకు సంబంధించి 48, పెన్షన్‌కు సంబంధించి 20, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 47 దరఖాస్తులు, జీవనోపాధి సమస్యలపై 5, ఇతర సమస్యలకు సంబంధించి 64 దరఖాస్తులతో కలిపి మొత్తం 184 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.