Guest Lecturers | గజ్వేల్, జూలై 20: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటోనామస్)లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుండి గెస్ట్ లెక్చరర్స్ (అతిథి అధ్యాపకుల) కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాలలో కంప్యూటర్స్ సైన్స్/అప్లికేషన్స్ – 2, మైక్రో బయాలజీ – 1, ఇంగ్లీష్ – 2, ఫిజిక్స్ – 1 సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో ఎస్సీ/ ఎస్టీలకు 50 శాతం, బీసీ/ఓసీలకు 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. అలాగే UGC NET, SET, Ph.D, పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ నెల 23న బుధవారం ఉదయం 11 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ, డెమో క్లాసుల ద్వారా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఆమె తెలిపారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి