Resource Persons | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21 : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (SCERT) ఆదేశానుసారం జిల్లా స్థాయి, మండల స్థాయిలో 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికిగాను సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ తెలిపారు.
నేటి నుండి 24వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించబడుతాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయి ప్రాథమిక విభాగంలో 8 మంది, జిల్లా స్థాయిలో 10 మంది, ఉన్నత పాఠశాల విభాగం జిల్లాస్థాయిలో 36 మంది, తెలుగు, ఆంగ్ల భాషలో 10 మంది, ఉర్దూ విభాగంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల విభాగం జిల్లాస్థాయిలో నలుగురు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల విభాగం జిల్లా స్థాయిలో నలుగురు రిసోర్స్ పర్సన్లకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్య్వూ నిర్వహించిన తరువాత తుది జాబితా ఈ నెల 28వ తేదీన ప్రకటిస్తామన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం