చిలిపిచెడ్, సెప్టెంబర్ 19: సమస్యల పరిష్కారం కోసం ధర్నాకు పిలుపునివ్వడంతో చిలిపిచెడ్ మండలంలో అంగన్వాడీ టీచర్లను (Anganwadi Teachers) పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు శశికళ, యాదమ్మ తదితరులు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కారం కోసం ధర్నా చేయడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారన్నారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని, వెట్టిచాకిరి చేస్తున్నామని చెప్పారు.
అంగన్వాడీ టీచర్లకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ అంగన్వాడి సెంటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లను పలు డిమాండ్లను పరిష్కారం కోసం మంత్రుల ఇండ్ల ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తు అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. తమ పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.