చేరికలతో బీఆర్ఎస్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. శనివారం రామాయంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో 200 మంది, వట్పల్లి మండలం పోతులబొగూడలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో సంగమేశ్వర్ తండా, మర్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కొండాపూర్‌లో తమ్మలిబాయితండా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ మోహన్ నాయక్‌ను హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపారన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మితే నట్టేట ముంచుతారని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని సూచించారు.
– అందోల్/ రామాయంపేట/ కొండాపూర్, సెప్టెంబర్ 30
అందోల్, సెప్టెంబర్ 30: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
శనివారం వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే నివాసంలో రేగోడ్ మండలం సంగమేశ్వర్ తండాకు చెందిన వార్డు సభ్యుడు తుల్జానాయక్తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, మర్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.