నర్సాపూర్, జనవరి 3: నర్సాపూర్‌లోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం పొంది నాలుగు నెలలు గడవక ముందే పాపగారి మనీషాను మృత్యువు కబలించింది. సంగారెడ్డి జిల్లాలో పీఆర్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న మనీషా నర్సాపూర్ పీఆర్‌కు డిఫ్యుటేషన్‌పై వచ్చింది. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన కవిత వెంకట్‌రెడ్డిలకు ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు మనీషా, రెండో కూతురు మాళవిక.
వ్యయప్రయాసలకోర్చి మనీషా తండ్రి కూతురు ను ఇంజినీరింగ్ చదివించారు. నాలుగు నెలల క్రితం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం వచ్చిందనే సంతోషం నాలు గు నెలలు గడవక ముందే కూతురు వారిని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఉద్యోగం వచ్చిందనే సంతోషం లేకుండా పోయిందే….. మేము పడ్డ కష్టం వృథా అయ్యిందే అంటూ మనీ షా తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చి న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మార్చు రీ వద్దకు పంచాయతీరాజ్ డీఈ రాధికాలక్ష్మి చేరుకొని మనీషా తల్లిని పట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.
నా ఫ్రెండ్స్ కాలేజీకి రాలేదు డాడీ….నేను కూడా ఇంటికి వస్తున్నా అంటూ ఇంటికి తిరుగు ప్రయాణమైన దూడి ఐశ్వర్య తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందనంత దూరానికి వెళ్లిపోయింది. నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామానికి చెం దిన మహేశ్వరి అనిల్ దంపతులకు కూతురు ఐశ్వ ర్య, కుమారుడు ప్రద్యుమ్న ఉన్నారు. ఐశ్వర్య కొంపల్లిలోని ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నది.
శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు ఐశ్వర్యను కాలేజీలో దించి రాగా, మిత్రులు కాలేజీకి రాలేదని ఇంటికి వస్తున్నానని తండ్రికి ఫోన్ చేసింది. జాగ్రత్తగా రమ్మని తన తండ్రి చెప్పడంతో ఐశ్వర్య ఆటోలో ఇంటికి తిరుగుప్రయాణమైంది. మృత్యు వు కారు రూపంలో దూసుకువచ్చి ఐశ్వర్యను కబలించింది. మృతదేహాన్ని నర్సాపూర్ మార్చురీకి తరలించడంతో కుటుంబసభ్యులు అంబులెన్సు లో ఉన్న ఐశ్వర్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
హైదరాబాద్‌కు చెందిన అనసూయ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పలుచోట్ల విరగగా నర్సాపూర్ ఏరియా దవాఖానలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నారాయణ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కౌడిపల్లి మండల కేంద్రం లో పని నిమిత్తం అనసూయ ఆటోలో బయలుదేరింది.
పొట్టకూటికని పనికెళ్లిన మాలావత్ ప్రవీణ్(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నర్సాపూర్ మండలంలోని ఎల్లారెడ్డిగూడ తండాకు చెందిన మాలావత్ ప్రవీణ్ గాగిల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య మధు, దివ్యాంగుడైన కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రవీణ్ మృతి తో ఎల్లారెడ్డిగూడ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంలో నర్సాపూర్ పట్టణానికి చెందిన ము గ్గురికి, ప్యాసింజర్ ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యా యి. నర్సాపూర్‌కు చెందిన వడ్డె రాజుకు చెందిన ఆటోలో గూనీ ప్రవీణ్, నవీన్ బోయిన్‌పల్లిలో కూరగాయలు తీసుకురావడానికి వెళ్లారు. పని ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. న ర్సాపూర్ అటవీ ప్రాంతానికి రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రవీణ్, రాజుకు తీవ్రగాయాలు కాగా, నవీన్‌కు స్వల్పగాయాలయ్యా యి. ప్రవీణ్ కండ్లకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని సరోజినిదేవి దవాఖానకు, రాజుని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్యాసింజర్ ఆటో డ్రైవర్ సంతుని మెరుగైన చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు.