Amrutha Manjari book | మెదక్ రూరల్, అక్టోబర్ 04 : మెదక్ జిల్లా కేంద్రంలోని న్యూ భారత్ ఫంక్షన్ హాల్ నందు అమృత మంజరీ.. అంకురం 2వ భాగం ఆధ్యాత్మిక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా ఇంచార్జ్ రవీందర్ తెలిపారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకే దేవుడు ఒకే దేశం సిద్ధాంతాన్ని భారతదేశం వ్యాప్తంగా చాటి చెబుతూ దేశ ప్రగతికి రాష్ట్ర అభివృద్ధికి, దేశ ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో మను జ్యోతి ఆశ్రమం నుండి అనేకమంది ప్రేమికులు జాతి, మత, కుల భేదాలు లేకుండా పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మన జ్యోతి ఆశ్రమం స్థాపకులు శ్రీమన్నారాయణ లహరి కృష్ణ చేతుల మీదుగా అమృత మంజరీ 2 భాగం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ శంకర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల శేషారెడ్డి , ఆధ్యాత్మిక అడ్వకేట్ బోయిన్ శ్రీనివాస్ అనేకమంది ఆధ్యాత్మిక ప్రేమికులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లయ్య, సాయిలు,మల్లయ్య, విజయ్ కుమార్, రమేష్ కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్