నిజాంపేట,జూన్11 : భూభారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని నార్లపూర్ మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి అన్నారు. బుధవారం నార్లపూర్ పాఠశాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు రైతులు హాజరై తమ భూములకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి దరఖాస్తుల రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. రైతులు ఏ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిఫ్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆర్ఐ ప్రీతి, ఇమాద్, నాయకులు సూర రాములు, నాగరాజు, సంజీవరెడ్డి, బాబు, జగన్ తదితరులు ఉన్నారు.