Jonathan Trott | అఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు చుక్కాని.. చెరగని ముద్రతో వీడ్కోలు..!
Jonathan Trott : మూడేళ్లలో అఫ్ఘనిస్థాన్ జట్టు ఆటలో వచ్చిన అనూహ్య మార్పులకు కారణం.. హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్ (Jonathan Trott). తన క్రికెట్ బుర్రతో అఫ్ఘన్ కుర్రాళ్లను రాటుదేల్చిన ట్రాట్.. అమ్మో ఆ జట్టుతో కాస్త జాగ్రత్త అనే అభిప్రాయం కలిగించాడు.
Jonathan Trott : ఒకప్పుడు అనామక జట్టుగా ఉండే అఫ్ఘనిస్థాన్ (Afghanistan) సంచలనాలకు కేరాఫ్‌గా మారడం చూసి వారెవ్వా ఏం ఆడుతున్నారు అని ఆశ్చర్యపోయాం. అంతర్జాతీయ వేదికలపై ఆ జట్టు బౌలర్లు స్టార్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెడుతుంటే వారి ప్రతిభకు సలాం కొట్టాం. మూడేళ్లలో అఫ్ఘనిస్థాన్ జట్టు ఆటలో వచ్చిన అనూహ్య మార్పులకు కారణం.. హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్ (Jonathan Trott). తన క్రికెట్ బుర్రతో అఫ్ఘన్ కుర్రాళ్లను రాటుదేల్చిన ట్రాట్.. అమ్మో ఆ జట్టుతో కాస్త జాగ్రత్త అనే అభిప్రాయం కలిగించాడు.
కాబూలీ టీమ్‌కు చుక్కానిలా నిలిచిన జొనాథన్ ట్రాట్ వరల్డ్‌కప్ గ్రూప్ దశ చివరి మ్యాచ్ అనంతరం బాధ్యతల నుంచి వైదొలిగాడు. భారమైన హృదయంతో వీడ్కోలు పలికిన అతడిని చూసి.. అఫ్ఘన్ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ట్రాట్ సైతం తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నానని చెప్పాడు.
Outgoing Afghanistan head coach says he’d be interested in leading a team ‘so close to his heart’ https://t.co/kvgcmrZOmC
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
‘ఆటగాడిగానే కాదు కోచ్‌గానూ మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను తొలిసారి ఓడించడం.. ఇంగ్లండ్‌ను మట్టికరిపించడం, పాక్ వంటి పెద్ద జట్టుపై ద్వైపాక్షిక సిరీస్ గెలుపొందడం మర్చిపోలేని విజయాలు’ అని ట్రాట్ వెల్లడించాడు. కోచ్‌గా చెరగని ముద్ర వేసిన ట్రాట్ వీడ్కోలు ప్రకటనను అఫ్ఘన్ ఆటగాళ్లు నమ్మలేకపోయారు. తమలో ఒకడిగా ఉంటూ.. జట్టును విజయాల వైపు నడిపించిన అతడి సేవల్ని గుర్తు చేసుకున్నారు. 95 పరుగులతో కెనడాపై విజయంలో కీలకమైన ఇబ్రహీం జద్రాన్ తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ట్రాట్‌కు అంకితమిచ్చాడు.
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు
చిన్నజట్టుగా క్రికెట్లోకి అడుగుపెట్టిన అఫ్ఘనిస్థాన్.. బంగ్లాదేశ్ మాదిరిగానే సంచలన ఆటతో వార్తల్లో నిలిచింది. సమిష్టిగా రాణిస్తూ.. పెద్ద జట్ల పాలిట విలన్లా మారింది. జొనాథన్ ట్రాట్ కోచింగ్‌లో ఆ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అసాధారణ ఆటతో రెచ్చిపోయిన అఫ్ఘన్ జట్టు. మాజీ ఛాంపియన్లను శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్థాన్‌లను చిత్తు చేసింది. పొట్టి ప్రపంచకప్‌లోనూ రషీద్ ఖాన్ సారథ్యంలో దుమ్మురేపి సెమీస్‌కు చేరింది. ఐసీసీ ఈవెంట్లో సెమీస్ వరకూ రావడం ఆ దేశ క్రికెట్లో పెద్ద సంచలనం. అయితే.. పదో సీజన్లో మాత్రం రషీద్ సేన స్థాయికి తగ్గట్టు ఆడలేదు. రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

