మెదక్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.43 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలల వారీగా నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.1.65 కోట్లను విడుదల చేసింది.
ఈ నిధులతో కేజీబీవీల్లో అదనపు వసతి గృహాలు, అదనపు టాయిలెట్లు, సాన్నపు గదులు, అదనపు కిచెన్ షెడ్లు, క్రీడాకోర్టులు, సెఫ్టిక్ ట్యాంకులు, డ్రెయినేజీ ఔట్లెట్లు, పైపులైన్ల నిర్మాణం, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఇది వరకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల మరమ్మతులు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు గతంలో అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను సైతం పూర్తిచేయాలి. ఆయా పనులకు అనుమతులు లభించకపోవడంతో పను లు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో మరమ్మతులకు నిధుల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. అప్పటి వరకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టి ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం మే 15న నిధులు కేటాయించింది. ఇప్పటికీ పనులకు సంబంధించిన అనుమతులు రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. కేజీబీవీ రేగోడ్‌లో ఆరో తరగతి నుంచి 10 వరకు రూ.45 లక్షలు కేటాయించగా, రూ.21.69 లక్షలు మంజూరయ్యాయి. అల్లాదుర్గం కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.8 లక్షలు కేటాయించగా, రూ.3.85 లక్షలు మంజూరు, చేగు ంట కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.8 లక్షలు కేటాయించగా, రూ.3.85 లక్షలు మంజూరయ్యాయి. చిప్పల్తుర్తి కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.16 లక్షలు కేటాయించగా, రూ.7.71 లక్షలు మంజూరయ్యాయి. చిట్కుల్ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి 10 వరకు రూ.48 లక్షలు కేటాయించగా, రూ.23.13 లక్షలు మంజూరయ్యాయి.
కొల్చారం కేజీబీవీలో 6 నుంచి 10 వరకు రూ.5 లక్షలు కేటాయించగా, రూ.2.4 లక్షలు మంజూరయ్యాయి. మెదక్ కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.56 లక్షలు కేటాయించగా, రూ.2 6.99 లక్షలు మంజూరయ్యాయి. పాపన్నపేట కేజీబీవీలో ఆరు నుంచి పది వరకు రూ.8 లక్షలు కేటాయించగా, రూ.3.85 లక్షలు మంజూరయ్యాయి. రామాయంపేట కేజీబీవీలో ఆరు నుంచి పది వరకు రూ.5లక్షలు కేటాయించగా, రూ.2.41 లక్షలు మంజూరయ్యా యి. పెద్దశంకరంపేట కేజీబీవీలో ఆరు నుం చి పది వరకు రూ.59 లక్షలు కేటాయించగా, రూ.28. 43 లక్షలు మంజూరయ్యాయి.
చిన్నశంకరంపేట కేజీబీవీలో ఆరు నుంచి పది వరకు రూ.8లక్షలు కేటాయించగా, రూ.3.85 లక్షలు మం జూరయ్యాయి. శివ్వంపేట కేజీబీవీలో ఆరు నుంచి పది వరకు రూ.56 లక్షలు కేటాయించగా, రూ.26.99 లక్షలు మం జూరయ్యాయి. టేక్మాల్ కేజీబీవీలో ఆరు నుంచి పది వర కు రూ.8 లక్షలు కేటాయించగా, రూ.3. 85 లక్షలు మంజూరయ్యాయి. తూప్రాన్ కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.8 లక్షలు కేటాయించగా, రూ.3.85 లక్షలు మంజూరయ్యాయి. వెల్ధుర్తి కేజీబీవీలో ఇంటర్మీడియెట్ వరకు రూ.5 లక్షలు కేటాయించగా, రూ.2.41 లక్షలు మంజూరయ్యా యి. మొత్తంగా 15 కేజీబీవీల్లో రూ.3.43 కోట్లు కేటాయించగా, రూ.1.65 కోట్లు మంజూరయ్యాయి.