సంగారెడ్డి కలెక్టరేట్/జహీరాబాద్, డిసెంబర్ 25: క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డితోపాటు పట్టణాలు, గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డిలోని సీఎస్ఐ చర్చి, రాక్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో హ్యాండ్లూమ్ డెవ లప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొన్నా రు. జహీరాబాద్లోని చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. చర్చిల్లో యువత, విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
జహీరాబాద్ పట్టణంతోపాటు జహీరాబాద్, మొగుడంపల్లి , ఝరాసంగం మండలాల్లో క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవులు సామూహిక ప్రార్థ్ధనలు నిర్వహించారు. పాస్టర్లు దైవ సందేశాలు చదివి వినిపించా రు. జహీరాబాద్ పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ ఆవరణలో మెథడిస్టు చర్చిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు.
పాస్టర్లతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. బాగారెడ్డిపల్లి, పస్తాపూర్, అల్లీపూర్, మొగుడంపల్లితోపాటు గ్రామాల్లో క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు క్యాంపు కార్యాలంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.