హుస్నాబాద్, జనవరి 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, రామవరం, కోహెడ, బెజ్జంకి, తోటపల్లి, మద్దూరు, లద్దునూరు పీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వైద్య పరీక్షల శిబిరాలను డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సౌమ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శిం చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
డివిజన్ పరిధిలో 142 సెంటర్ల్లు ఏర్పాటు
హుస్నాబాద్ డివిజన్లోని 8 పీహెచ్సీల పరిధిలో మొత్తం 142 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని జనాభాను బట్టి సెంటర్లు కేటాయించారు. పీహెచ్సీల వారీగా చూస్తే అక్కన్నపేట పీహెచ్సీ పరిధిలో 17 సెంటర్లను ఏర్పా టు చేయగా, ఇక్కడ 93 రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. హుస్నాబాద్ సీహెచ్సీ, పీహెచ్సీల పరిధిలోని హుస్నాబాద్ పట్టణంతో పాటు గ్రామీణంలో మొత్తం 37 సెంటర్లు ఉండగా, 178 రోజుల పాటు కంటి పరీక్షలు చేస్తారు. బెజ్జంకి పీహెచ్సీ పరిధిలో 11 సెంటర్లు, 88 రోజులు, లద్దునూరు పీహెచ్సీలో 13 సెంట ర్లు, 88 రోజులు, కోహెడ పీహెచ్సీలో 27 సెం టర్లు, 180 రోజులు, మద్దూరు పీహెచ్సీలో 10 సెంటర్లు, 69 రోజులు, రామవరం పీహెచ్సీలో 15 సెంటర్లు, 77 రోజులు, తోటపల్లి పీహెచ్సీ పరిధి12 సెంటర్లలో 67 రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 142 టీంలు నిరంతరంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాయి. డివిజన్ పరిధిలోని వైద్యాధికారులు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులు కంటి వెలు గు సెంటర్లను పర్యవేక్షిస్తారు.
కంటివెలుగు సద్వినియోగం చేసుకోవాలి
హుస్నాబాద్ డివిజన్లోని అన్ని పీహెచ్సీల్లో ఆధునిక యం త్ర పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం నుంచి కంటి పరీక్షలు ప్రారంభమవుతాయి. కంటి సమస్యలు ఉన్నవారు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి. అనుభజ్ఞులైన కంటి వైద్యుల నియామకం చేయడం ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్యసేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ సౌమ్య, డిప్యూటీ డీఎంహెచ్వో -హుస్నాబాద్