మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్13: సిద్దిపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్డి లేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఈనెల 11న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనానికి రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరిమురళి స్పందించారు. శుక్రవారం కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు తాను కృషి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. మద్దూరు జూనియర్ కళాశాలలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ. 13.80లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
నెలన్నర వ్యవధిలో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో 2021లో ప్రభుత్వం మరుగుదొడ్డని మంజూరు చేసిందని, పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముం దుకు రాలేదని జిల్లా కల్టెర్ చెప్పినట్లు తెలిపా రు. అనంతరం మోడల్ స్కూల్‌ను ఆయన సందర్శించి స్కూల్లో ఉన్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఐఈవో రవీందర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.