నర్సాపూర్,మే14 : మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడరాదని వాటి వల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేతల్తు పద్మశ్రీ, గీత పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని కాగజ్మద్దూర్, జక్కపల్లి గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు-అన్నదాతలకు అవగాహన కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
యూరియా వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం, వరి, పత్తి పంట సాగులో తీసుకోవలసిన మెళకువలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు శాస్త్రవేత్తలను తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సవిత, గాయత్రి, ఏఈవోలు చంద్రవేణి, తేజస్విని, ఆయిల్ ఫామ్ సిబ్బంది అజయ్, జాన్సన్, ఉద్యానవన అధికారి సంతోష్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, మహిళలు మరియు రైతులు పాల్గొన్నారు.