Additional Collector Nagesh | మెదక్ రూరల్, ఏప్రిల్ 30 : మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి నేడు పదవీ విరమణ పొందుతున్న ఎంఈఓ నీలకంఠంను సన్మానించారు. మెదక్ మండల విద్యాధికారి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ నీలకంఠం పదవీ విరమణ సందర్భంగా ఆయనను అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్తో సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 37 సంవత్సరాల 5 నెలలపాటు విద్యాశాఖలో వివిధ హోదాలలో పనిచేసి వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి నీలకంఠం అన్నారు. మండల విద్యాధికారిగా పనిచేస్తూ జిల్లా కేంద్రంలోఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలలో ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా విధులు నిర్వహించిన వ్యక్తి నీలకంఠం అన్నారు.
మెదక్ మండలంతోపాటు జిల్లాలోని 9 మండలాలకు మండల విద్యాధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. అంతకుముందు మండల వనరుల కేంద్రంలో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యులు నీలకంఠను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, విద్యాశాఖ కార్యాలయ సూపరిండెంట్ లక్ష్మీకాంత రాజ్, అసిస్టెంట్ సెక్రటరీ సదన్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం