సిద్దిపేట, మే 5: సమస్యల సత్వర పరిషారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సోమవా రం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ఆమె దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యా యం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భూసంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు మొత్తం 78 వచ్చాయన్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.