మెదక్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్‌తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి దరఖాస్తుదారుని సమస్యను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిషరించాలన్నారు.
ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు పరిషరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అర్జిదారులు దూర ప్రాంతాల నుంచి వస్తారని, వారి సమస్యలను పరిషరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో పలు సమస్యలపై 128 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన గొల్ల దుర్గయ్య అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్‌ను అందజేశారు.