Grains on Roads | పాపన్నపేట, ఏప్రిల్ 17 : మండలంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మిన్ పూర్, యూసుఫ్ పేట శివార్ల వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు. ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు రైతులు సహకరించాలని సూచించారు. ఎస్ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత